ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు
ఆక్రమణలపై ప్రజావాణి లో అడిషనల్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన ఆకుల సతీష్
మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని బహదూర్ పల్లి గ్రామం, సర్వేనెంబర్ 227/1 నందు ప్రభుత్వ భూమి 153 ఎకరాలు గా రికార్డులు నందు ఉండగా, ఈ ప్రభుత్వ భూమిని సాయినాథ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని హైకోర్టులో ఎనిమిది కేసులు విచారణ జరగడం సాగుతున్న ప్రభుత్వ భూమి అని అప్పటి అడిషనల్ కలెక్టర్ జగన్ మోహన్ రావు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా హైకోర్టు నందు ఎనిమిది కేసులు విచారణ జరగగా, ఇటీవల హైకోర్టు తీర్పు ఇస్తూ జిల్లా కలెక్టర్ దీనిపై నిర్ణయం తీసుకోమని మరియు సాయినాథ్ సొసైటీకి కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం చూస్తుంటే అధికారులకు ప్రభుత్వ భూమి అని రిపోర్ట్ ఇచ్చినా కూడా కాపాడుకోలేని స్థితిని స్పష్టం చేస్తుందని, తక్షణమే ప్రభుత్వ భూమిని కాపాడాలని అవసరమైతే హైకోర్టులో అప్పీలు దారనైన కాపాడాలని అడిషనల్ కలెక్టర్ కి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసి కోరడం జరిగింది.
అదేవిధంగా నిజాంపేట్ సర్వేనెంబర్ 233/22 నందు 1. 28 ఎకరం ప్రభుత్వ భూమిలో గతంలో మున్సిపల్ వైకుంఠధామం కోసం రెవెన్యూ అధికారుల కేటాయించగా 2009కి ముందు అక్రమ 16 ప్లాట్ లకి (3200 గజలకు) రెవెన్యూ అధికారులు ఎన్ఓసి ఇచ్చారని, స్మశాన వాటికలో ఎకరం పైచిలుకు స్థలాన్ని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం సహకారంతో కబ్జా చేసుకున్న కల్వకుంట్ల కన్నారావుపై తక్షణమే చర్యలు తీసుకొని, వైకుంఠధామం స్థలాన్ని కాపాడాలని ఎమ్మార్వోకి ఫిర్యాదు చేసిన కూడా చర్యలు తీసుకోకపోవడంపై అడిషనల్ కలెక్టర్ పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. 233/2 సర్వేనెంబర్ నిజాంపేట్ లో కాంగ్రెస్ కో ఆప్షన్ కార్పొరేటర్ సర్వే నెంబర్ 283 చూపిస్తూ వెయ్యి గజాల ప్రభుత్వ భూమిలో అనుమతులు తెచ్చుకొని, నిర్మాణంపై అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హెచ్ఎండిఏ అధికారులు అనుమతులు రద్దు చేస్తే, కోర్టు పేరుతో స్టే తెచ్చుకొని నిర్మాణం పూర్తవుతున్న ఇప్పటివరకు సరైన కౌంటర్ ఫైల్ చేసి ప్రభుత్వ భూమిని 1000 గజాలు కాపాడాలని, ప్రభుత్వ స్థలాన్ని ప్రజా అవసరాలకు వినియోగించాలని అడిషనల్ కలెక్టర్ ని మరియు లా ఆఫీసర్ను కోరడం జరిగింది. ప్రజావాణి నందు అడిషనల్ కలెక్టర్ విజయేంద్ర కుమార్ ఫిర్యాదు చేసిన వారిలో ఆకుల సతీష్, అరుణ్ రావు, ఈశ్వర్ రెడ్డి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.