మన ప్రగతి న్యూస్/ నడికూడ:
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు.. మంగళవారం నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్లు ఒకటి, రెండు, మూడు, నాలుగు సెంటర్లను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్,నడికూడ మండల తహసిల్దార్ గుండాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.వంట చేసే ప్రదేశాన్ని మరియు వంట పాత్రలను, విద్యార్థులకు అందజేసిన మధ్యాహ్న భోజనాన్ని గమనించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని సూచించారు. అంగన్వాడి సెంటర్ లలో పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధం గా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్య క్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కె. శ్రీదేవి,అంగన్వాడీ టీచర్లు పి.సరిత, కోడెపాక సుప్రియ,బి.రజిని కుమారి, ఎం. లక్ష్మీ, ఆయాలు రాధ, వనజ, ముత్యాల రమ,గర్భిణీ స్త్రీలు,పిల్లలు,తల్లులు ఉన్నారు.