- కమీషనర్ కు మెమోరాండం అందజేసిన మాజీ సర్పంచులు..
మన ప్రగతి న్యూస్/నడికూడ:
మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ.. మంగళ వారం హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్ కమీషనర్ దివ్య ను కలిసి మాజీ సర్పంచ్ ల ఫోరం ప్రతినిధులు మెమో రాండం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కింద గ్రామ పంచాయతీలకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయా లని వారు కోరారు. ఈ సందర్భంగా కమీ షనర్ దివ్య స్పందిస్తూ.. మీ పెండింగ్ బిల్లులను రికార్డు ప్రకారం చెల్లిస్తా మని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, నడికూడ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు, ముస్త్యాల పల్లి మాజీ సర్పం చ్ బొట్ల సంధ్య రవీందర్, ఇతర మాజీ సర్పంచులు ఉన్నారు.


