– చట్టవిరుద్ధ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు: సి.ఐ నటేష్ హెచ్చరిక
మన ప్రగతి న్యూస్ /వేములవాడ:
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో నకిలీ సిగరేట్ల విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు టాస్క్‌ఫోర్స్ సి.ఐ నటేష్ తెలిపారు.పట్టణంలోని పలు కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, పాన్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ సిగరేట్లను విక్రయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.నకిలీ సిగరేట్ల తయారీ లేదా విక్రయాలపై సమాచారం ఉన్నట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలు, వ్యాపారులను సి.ఐ కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనకు ప్రజల సహకారం అత్యవసరమని ఆయన తెలిపారు.ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తిరుపతి, రాజేష్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.

