Breaking News

లగచర్ల రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అదేశను సారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపుమేరకు డాక్టర్ బి.ఆర్ అంబేత్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగేలి వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రo అందజేశారు. ఈ సందర్భంగా నాగల్లి వెంకట్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ లగచర్ల సంఘటనలో అన్యాయంగా రైతులను ఇరికించి వారి జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని, తక్షణమే రైతులను విడుదల చేసి వారిపై ఉన్న కేసులను కోట్టి వేయాలన్నారు. రైతుల ఉసురు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం మనగడ సాగించదని ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత వచ్చిందన్నారు.లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ,అమానవీయ,అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి,వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేత్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఒడిసిఎంఎస్ చైర్మన్, జిల్లా నాయకులు, పట్టణ పార్టీ అధ్యక్షుడు , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీపీ లు, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ యూతు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం