Breaking News

త్రుటిలో తప్పిన ప్రమాదం.

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజవర్గం లోనిప్రజ్ఞాపూర్ రిమ్మన గూడ శివారులోని రింగు రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అశోక్ లిలాండ్ డీ కొట్టడం తో గుంతలో కూరికిపోయి త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట కు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు. మునిగడప నుంచి అశోక్ లిలాండ్ తిమ్మాయిపల్లి వెళుతున్న క్రమంలో ప్రజ్ఞాపూర్ ఫ్లైఓవర్ దాటి రింగ్ రోడ్ సమీపంలో బస్సును ఢీకొట్టడంతో అదుపుతప్పి త్రుటిలో తప్పిన ప్రమాదం. బస్సు అద్దం పూర్తిగా ధ్వంసమైంది.డ్రైవర్ సమయ స్ఫూర్తి తో వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటడ్డారు.
అశోక్ లైలాండ్ లో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి వారి అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.