Breaking News

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం

  • బిఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు

మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి:

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎం.పి మంచిర్యాల జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు.చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు,పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన బి.ఆర్.ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ,లగచర్ల గ్రామానికి చెందిన గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన భీమారం కోటపల్లి చెన్నూర్ మండలం మరియు చెన్నూర్ పట్టణం బి.ఆర్.ఎస్ నాయకులు.తప్పకుండ ఈ ప్రభుత్వం రైతులను అమానుషంగా అన్యాయంగా కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతుందని అన్నారు.లగచర్ల గిరిజన రైతుల కు గుండె నొప్పి వచ్చినగాని రైతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్న అధికార ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.ఈ ప్రభుత్వం బేషరతుగా లగచర్ల రైతులకు క్షేమపన చెప్పి రైతులను విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు.అత్యున్నత చదువుని రాజ్యంగా స్ఫూర్తి తో ఉద్యోగం సాదించిన పోలీస్ అధికారులు కూడా విచక్షణ రహితంగా రైతనలను అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,అలాగే
మొన్నటికి మొన్న హైదరాబాద్ నడి ఒడ్డున నిరసన చేపట్టిన ఆశ వర్కర్లను మహిళలని కూడా చూడకుండా అత్యంత అమానుషంగా పోలీస్ లు మహిళల పై చేయి చేసుకోవడం అత్యంత హీనమైన చర్య అని దుయ్యబట్టారు.రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన 420 హామీలను 6 గ్యారంటీ లని నెరవేర్చాలని కానీ పనికిమాలిన చర్యలు అకృత్యాలకు పాల్పడితే రేవంత్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరిచారు.రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు,ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు,మాజీ ఎంపీపీ మంత్రి బాపు,పి.ఎ.సి.ఎస్ చైర్మన్ సాంబాగౌడ్,సీనియర్ నాయకులు బడికల సంపత్,యూత్ పట్టణ అధ్యక్షులు నాయిని సతీష్ రాజ్,కౌన్సిలర్స్ రెవెల్లి మహేష్,తుమ్మ రమేష్,జగన్నదుల శ్రీను,జోడు శంకర్,
అయూబ్ కో అప్షన్ వేల్పుల సుధాకర్, బీమారం మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్, కోటపల్లి సీనియర్ నాయకులు అసంపల్లి సంపత్ కుమార్,యువ నాయకులు చందు,అజయ్.మహిళ నాయకులు భారతీ,రిజిత.యువ నాయకులుమెడసురేష్,వేములమహేందర్,ఆరిఫ్,పాశంఆశిష్,నాయుబ్,జడలమల్లేష్,వెంకన్న,సాయి రెడ్డి, విజయ్,రామకృష్ణపూర్ నాయకులు చంద్రమౌలి,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు