మన ప్రగతి న్యూస్/ నాగార్జున సాగర్ ప్రతినిధి
కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులని అరెస్టు చేసి బేడీలు వేసి జైలుకు పంపినందుకు నిరసనగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళ వారం రోజు నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక హిల్ కాలనీ బస్టాండ్ లో ఉన్నటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పి అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ రమేష్ జి ,లక్ష్మణ్ నాయక్ ,అర్జున్ శివ వీరయ్య పల్లవోలు రమణ ,షరీఫ్ ముత్తయ్య ,పిట్ట సైదులు , షేక్ హాజీ ,నశీర్ అన్వర్ ,సుభాని షేక్ ముజ్జు ,మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు