బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వెంచర్లలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

వెంచర్లలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్ /తల్లాడ

సప్తగిరి వెంచర్లో పనిచేస్తున్న కూలీ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ ఘటన తల్లాడ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి తండ్రి అలుగు వెంకటస్వామి తెలిపిన వివరాలప్రకారం కొత్తగూడెం రోడ్డులో గల సప్తగిరి వెంచర్లో ఆంధ్రా రాష్ట్రం పల్నాడు జిల్లా బుచ్చివనేపాలెం గ్రామానికి చెందిన అలుగు వెంకటేశ్వర్లు (34) అనే వ్యక్తి కుటుంబంతో రెండు నెలల క్రితం కూలి పని నిమిత్తం తల్లాడ మండలానికి వచ్చారు. మంగళవారం పని నిమిత్తంలో ఐజాక్సు (కాంక్రిట్​ కలిపే వాహనం)లో కాంక్రీట్ కలుపుతున్న సందర్భంలో 11 కేఈ విద్యుత్ తీగలు ఐజాక్స్ బాడీకి తగిలింది.
అదే సమయంలో కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాన్ని పట్టుకున్న వెంకటేశ్వర్లు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో కింద పడిపోయాడు. ఆయన్ని స్థానికులు తల్లాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు సీపీఆర్ చేసిన తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పడంతో 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సప్తగిరి వెంచర్​ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తండ్రి తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం