మన ప్రగతి న్యూస్ /జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి :
రేగొండ మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి గత నాలుగు నెలలకు సంబంధించి హుండీలను మంగళవారం దేవస్థానం ఆవరణలో లెక్కించారు. భక్తులు ఉండిలలో వేసిన కానుకలను విప్పి లెక్కించగా 8 లక్షల 92, వేల ఇరువది ఒక్క రూపాయి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వణ అధికారి ఎస్ మహేష్ తెలిపారు .ఈ హుండీల లెక్కింపు కార్యక్రమానికి పరిశీలకులుగా ఎన్ కవిత పరకాల డివిజన్, గ్రామ కార్యదర్శి ఆముల్య ,గ్రామ పెద్దలు డోబిలి కోటి, పబ్బ సమ్మయ్య, కొలుగూరి సంపత్ రావు, పబ్బ ఓదెలు, బ్రహ్మం ,మోరే మొగిలి, నిమ్మల రాజు భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.