Breaking News

ప్రభుత్వ ధమన నీతికి పరాకాష్ట..! సెకండ్ ఏ ఎన్ ఎం ల అరెస్ట్..

మన ప్రగతి న్యూస్ /రేగొండ :

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ధమన నీతికి పరాకాష్ట సెకండ్ ఏఎన్ఎం ల అక్రమ అరెస్టులు అని రేగొండ సెకండ్ ఏ ఎన్ ఎం ల అధ్యక్ష కార్యదర్శులు బొట్ల దీన, కటకం సదాలక్ష్మి లు అన్నారు. మంగళవారం రేగొండ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా సెకండ్ ఏఎన్ఎం లుగా చాలిం చాలని జీతాలతో ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాలలో సెకండ్ ఏ ఎన్ ఎం లకు ప్రమేయం లేని విషయాలలో కూడా సెకండ్ ఏఎన్ఎంల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటున్నదని, తమకు సంబంధం లేని విషయంలో కూడా ప్రభుత్వానికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. కానీ ప్రభుత్వం సెకండ్ ఏఎన్ఎంల సేవలను గుర్తించి పర్మినెంట్ చేయవలసి ఉండగా గత 17 సంవత్సరముల క్రితం నుండి పని చేస్తున్న మాకు ఈనెల 28న జరిగే పరీక్షల ద్వారా పాస్ అయితేనే పర్మినెంట్ చేస్తామని అనడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శమని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి పరీక్షలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6500 మంది సెకండ్ ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయాలని లేదా గ్రాస్ శాలరీ అయిన వచ్చేటట్లు చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎంలు బి కళావతి, కే మంజుల, ఎన్ రాధిక, వై జ్యోత్స్నా దేవి, కే భాగ్య , ఎన్ యాదలక్ష్మి, బి అనసూర్య తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి