మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ శాఖ అధికారుల చర్యలతో అక్రమ మద్యం రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది.జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్లు ప్రసాద్, మహేష్‌లు సంయుక్తంగా పని చేస్తూ అక్రమ మద్యం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు..
ఈ వాహనం లోని మద్యం ఇందారం నీలిమ వైన్స్ నుండి టేకుమట్ల పరిధిలోని సంబంధిత బెల్ట్ షాపులకు అక్రమంగా తరలిస్తున్నట్లుగా డ్రైవర్లు ఎస్సై నాగరాజు విచారణలో చెప్పుకొచ్చారు.ఈ మద్యం విలువ సుమారు 40 నుంచి 50 వేలు వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేశారు.
తదుపరి చర్యగా ఎక్సైజ్ అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, మంచిర్యాల జిల్లా పరిధిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించుకొని తీసుకెళ్లారు.
ఈ తరహా అక్రమ రవాణా సంఘటనలు చాలా మట్టుకు నియంత్రణలోకి రాలేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఘాటుగా స్పందించి మరింత నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.