Breaking News

సోమన్న ఆలయానికి తలనీలాలు వేలం ద్వారా రూ.9,22,000 లక్షల ఆదాయం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:

శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 2024-2025 సంవత్సరం తలనీలాలు పోగు చేసుకునే హక్కు కోసం నిర్వహించిన బహిరంగ వేలం పాట ద్వారా రూ.9,22,,000 లక్షలు దేవాలయానికి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు తెలిపారు. మంగళవారం కమిషనర్, దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యాలయం హైదరాబాద్ యందు తలనీలాలు పోగుచేసుకునే హక్కు కోసం బహిరంగ వేలం పాట నిర్వహించగా ఆంధ్రప్రదేశ్, రాష్ట్రం, ప్రకాశం జిల్లా, అద్దంకి గ్రామానికి చెందిన దాసరి నాగయ్య రూ.9,22,000 లక్షల హెచ్చు పాట పాడి తలనీలాలు పోగుచేసుకునే హక్కును దక్కించుకున్నాడు.
తలనీలాలు గత సంవత్సరము పాట ముగిసిన రోజు నుండి ఇప్పటివరకు పాటకు మధ్యలో వచ్చిన వెంట్రుకలను కిలో చొప్పున వేలం ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామానికి చెందిన బొజ్జ ఏడుకొండలు 1 కేజీకి రూ. 11,100/- లకు హెచ్చు పాట పాడి కొనుగోలు చేసినట్లు ఈవో తెలిపారు.
కొబ్బరి చిప్పలు చేసుకోను హక్కు కోసం ఎవరు టెండర్ షెడ్యూల్ కొనుగోలు చేయకపోవడంతో వాయిదా వేసినట్లు ఈవో తెలిపారు .ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి,,ఆలయ సూపర్డెంట్ కొత్తపల్లి వెంకటయ్య, పాటదారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం