మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:
తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మేడారపు సుధాకర్ ను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ నియమించారు, మంగళవారం సికింద్రాబాద్ లో గల హరిహర కళాభవన్ లో జరిగిన తెలంగాణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్, వికారాబాద్ జిల్లా స్పెషల్ మెజిస్ట్రేట్ నామాల అశోక్ , అఖిల భారత పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఈగ మల్లేషం, నిమ్స్ లైజనింగ్ ఆఫీసర్ మార్త రమేష్ లు డాక్టర్ మేడారపు సుధాకర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డాక్టర్ మేడారపు సుధాకర్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక విద్యార్థి ఉద్యమాలు, కుల సంఘ ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించడాన్ని గుర్తించి టిఆర్ పిఎస్ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని, వెనుక బడిన పద్మశాలి, చేనేత కుటుంబాలకు చెందిన విద్యార్థులను సమీకరించి వారికి అందాల్సిన ఫలాల కోసం ఉద్యమిస్తూ, రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ సూచన మేరకుముందుకె
ళ్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో ఏర్పడ్డ ఏకైక సంఘంలో కీలక భాద్యతలు అప్పగించిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ కు,
ధన్యవాదాలు తెలిపారు. నా నియమానికి సహకరించిన అసోసియేట్ అధ్యక్షులు దుస్స శివశంకర్, గౌరవాధ్యక్షులు వేముల బాలరాజు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ డా.చందా మల్లయ్య, జనగామ జిల్లా పోపా కార్యదర్శి చిదురాల ఎల్లయ్య, పద్మశాలి సంఘం నాయకులు పాము మోహన్, చిలుకమారి వెంకటేశ్వర్లు, చిలుకమారి సోమేశ్వర్, కాటబట్టిని రమేష్, బిల్లా యాదగిరి, పాసిగంటి రాజేంద్రప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు