బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ముఖ్యమంత్రి ఛాంపియన్షిప్ ట్రోఫ్రి (సిఎం కప్) క్రీడల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు….జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ముఖ్యమంత్రి ఛాంపియన్షిప్ ట్రోఫ్రి (సిఎం కప్) క్రీడల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు….జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మన ప్రగతి న్యూస్/
మహబూబాబాద్ బ్యూరో

ముఖ్యమంత్రి ఛాంపియన్షిప్ ట్రోఫ్రి (సిఎం కప్) క్రిడల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కే.వీర బ్రహ్మచారి, డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి రావు, సంబంధిత అధికారులతో కలిసి సీఎం కప్ క్రీడల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 19 నుండి 21 వరకు మహబూబాబాద్ జిల్లా స్థాయి ముఖ్యమంత్రి ఛాంపియన్షిప్ ట్రోఫీ, సీఎం కప్ క్రీడాలు నిర్వహించడం జరుగుతుందని, అందుకోసం జిల్లాలో ఉన్న పాఠశాలలు, గ్రామస్థాయిలో యువతి, యువకులు రిజిస్టర్ చేసుకొని మండల స్థాయి నుండి క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారు ఈనెల 19 నుండి 21 వరకు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని జిల్లాలోని యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని, సూచించారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారుల కోసం వసతి భోజనం, రవాణా తదితర సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
క్రీడలు జరుగు ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ,రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు.
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి సీఎం కప్ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో మహబూబాబాద్ ఆర్డిఓ కృష్ణవేణి, జిల్లా క్రీడల అధికారి నీ జ్యోతి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహస్వామి, జడ్పీ సీఈవో పురుషోత్తం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మురళీధర్, మున్సిపల్ కమిషనర్ రవీందర్, డిఈ ఉపేందర్, మహబూబాబాద్ తహసీల్దార్ భగవాన్ రెడ్డి, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం