Breaking News

కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో దుప్పట్లు పంపిణీ చేసిన ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్

మన ప్రతి న్యూస్ /నల్లబెల్లి

మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థినిలకు ఏబిఎస్ఎఫ్ , స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు . స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ నిర్వాకుల దృష్టికి చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పిన వెంటనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు స్పందించి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి వరంగల్ జిల్లా జిసిడివో ఫ్లోరెన్స్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డ రాజు, ప్రశాంత్, వినయ్, మరియు విద్యార్థినిలు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం