మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండల కేంద్రంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో మండల తహసిల్దార్ ముప్పు కృష్ణ కి తెలుగు భాషను విస్తృతంగా ప్రచారం చేయాలని దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య వినతి పత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ మరియు పరిపాలన విషయాలకు సంబంధించి తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ప్రచురించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఉన్నత విద్యలు అభ్యసించినటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు తెలుగు సబ్జెక్టును ఆప్షనల్ గా ఎంచుకొని ఎమ్మే తెలుగు మరియు బిఈడి పూర్తి చేసినటువంటి యువతీ యువకులకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి విషయాన్ని పరిశీలించి తెలుగు అకాడమీకి అధిక నిధులు కేటాయించి తెలుగు భాషను విస్తృతంగా ప్రచారం చేయాలని ,సామాన్య ప్రజలకు తెలుగును అందించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు గుబరాజు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.