మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ బంధు బిల్లును ప్రవేశపెట్టాలని తహసిల్దార్ ముప్పుకృష్ణకు వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్యమకారుల ఫోరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు పోరాటం చేసి పోలీస్ కేసులకు గురి అయిన తెలంగాణ ఉద్యమకారులు అందరికీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో 6 గ్యారంటీలలో భాగంగా పొంద పరిచిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నెలకు 25 వేల పెన్షన్ సౌకర్యంతో పాటు ఉచిత బస్సు, రైల్స్ సౌకర్యం కల్పించుటకు శీతాకాల శాసనసభ సమావేశాలలో ఉద్యమ బంధు బిల్లు ప్రవేశపెట్టి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబరావు, జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, డివిజన్ ఉపాధ్యక్షులు గుబరాజు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కాగా మండల శాఖ అధ్యక్షులు తంగేళ్ల భాస్కర్, కొత్తగట్టు ప్రభాకర్, బత్తిని మల్లయ్య, పరికి నవీన్, ఓదెల రవి, బొట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.