Breaking News

ఈత తాటి చెట్లను ధ్వంసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు..

_ఇలాంటి పునరావృతం కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ పట్టణానికి చెందిన బాలసాని నారాయణ, బాలసాని బాలరాజు.నరేష్ అను ముగ్గురు వ్యక్తులు పొలంలో వున్న దాదాపుగా 25కి పైగా తాటి చెట్లను ఎలాంటి పర్మిషన్ లేకుండా కాల్చి,వాటిని కోయడం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న ముస్తాబాద్ గీత కార్మికులు తమ ఉపాధిని కోల్పోయేలా చేసిన ముగ్గురి పైన చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ సిఐ కి పిర్యాదు చేయగా వారు వచ్చి పరిశీలించి ముగ్గురు పైన కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా గీత కార్మికులు మాట్లాడుతూ తమ బతుకు దేరువే ఈత, తాటి చెట్లు అని, అలాంటి వాటిని ఇలా కోయడం వల్ల మాకు ఉపాధి లేకుండా పోతుందని, భవిష్యత్తులో మరెవరు ఇలా చేయకుండా వీరిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్య్రమంలో పట్టణ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బండి లక్ష్మయ్య, బొంగొని రాములు, మద్దికుంట ఎల్లయ్య, గుండెల్లి రాములు, అక్కపల్లి రాజారాం, కొత్తపల్లి బాలయ్య, పెద్దూరి రంగయ్య, పెద్దూరి సత్తయ్య, వేముల రాజేశం, భూంపల్లి శ్రీను, అక్కపల్లి నారాయణ, అక్కపల్లి యాదగిరి, బొంగోని అయోధ్య, పెద్దూరి దేవేందర్, బొంగోని ఆంజనేయులు, బొంగొని రాజం, బాలసాని దేవరాజు, గుండేల్లి శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు..