మన ప్రగతి న్యూస్/నర్సంపేట:
వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఎండీ మొయిజ్ పదోన్నతి పొందారు. నర్సంపేట మెడికల్ కాలేజి ఆఫీస్ సుపరిటెండెంట్ గా పోస్టింగ్ పొందారు. ఈ నేపథ్యంలో నర్సంపేట ప్రభుత్వ వైద్యశాల ఆసుపత్రి సుపరిటెండెంట్ డాక్టర్ మోహన్ దాస్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. టిఎన్జీవో హానుమకొండ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, మోయిజ్ లు మోహన్ దాస్ కి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా గతంలో కాకతీయ మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేసిన డాక్టర్ మోహన్ దాస్ మాట్లాడుతూ మొయిజ్ సేవలు మరువలేనివన్నారు. నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిఅని, పదోన్నతి పొందిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.