మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హరీష్ రావు నేతృత్వంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మరియు ఇతర బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ని కలిసి గత కొంతకాలంగా “ఫార్ములా – ఈ” రేస్ పై వస్తున్న నిరాధార ఆరోపణలపై శాసనసభలో చర్చ జరిపించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… “ఫార్ములా – ఈ” రేస్ నిర్వహణలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎటువంటి పొరపాట్లు చేయలేదని, నిబంధనల మేరకే “ఫార్ములా – ఈ” నిర్వాహకులకు చెల్లింపులు జరిగాయని మా నాయకులు కేటిఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని, ప్రభుత్వం మాత్రం “ఫార్ములా – ఈ” రేసింగ్ వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ కక్షపూరితంగా బిఆర్ఎస్ పార్టీపై, కేటీఆర్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు నిజా నిజాలు తెలియజేసేందుకు అసెంబ్లీ వేదికగా మా నాయకులు కేటీఆర్ చర్చకు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి ఈ అంశాన్ని సభలో చర్చించేలా సభాపతి నిర్ణయం తీసుకోవాలని కోరారు.