మన ప్రగతి న్యూస్/హత్నూర:
నూతనంగా ఉద్యోగం సంపాదించి ట్రైనింగ్ లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి ఎస్సైలకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని సిరిపురం మాజీ ఎంపీటీసీ మచ్చ నరేందర్, హత్నూర పోలీస్ స్టేషన్ లో ఘనంగా శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగరీత్యా ట్రైనింగ్ చేస్తూ ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్న తక్షణమే స్పందించేటువంటి పోలీస్ సిబ్బంది శాంతి భద్రతలో ప్రజలతో మమేకమై ఉద్యోగం సాఫీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, నగేష్ గౌడ్, మధు,మణయ్య,మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.