Breaking News

వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు

మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి:

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ప్రాంతంలోని తాళ్ల గురియాల ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం కమిషనరేట్ (ఐజి)ఐ.పి.ఎస్ ఎం.శ్రీనివాస్,అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు బెల్లంపల్లి రూరల్ సి.ఐ అఫ్జల్ ఉద్దీన్ ఆధ్వర్యంలో కన్నెపల్లి నెన్నెల్ వెల్లే చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా వాహనాల యొక్క డాక్యుమెంట్స్ లేని వాటికి ఫైన్స్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కలిగి ఉండి అధికారులు అడిగిన వెంటనే చూపించాలని,మోటర్ బైక్,నడిపేవారు హెల్మెట్లు ధరించి అతివేగంగా కాకుండా జాగ్రత్తగ నడిపిగమ్యం చేరుకోవాలని తెలియజేయడం జరిగింది.ప్రతి ఒక్క వాహనదారుడు వాహనం యొక్క సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకొని పోలీసు వారకి చూపించి సహకరించాలని తెలియజేయడం జరిగింది,ఈ యొక్క వాహనాల తనిఖీలలో తాళ్లగురిజాల ఎస్.ఐ
సి.హెచ్ రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం