Breaking News

ధూప దీప నైవేద్య అర్చకులకు 25 వేల వేతనం అందించాలి

తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కార్యదర్శి కర్నే సాంబయ్య

ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట రమణా చార్యులు

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

ధూప దీప నైవేద్య అర్చకులకు ప్రభుత్వం ప్రతినెల 25 వేల వేతనం అందించాలని ధూప దీప నైవేద్యం అర్చక సంఘం తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కార్యదర్శి కర్నె సాంబయ్య, జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ చార్యులు అన్నారు. ధూప దీప నైవేద్య అర్చకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అర్చక వెల్ఫేర్ ఫండ్ సదుపాయాలను ధూప దీప నైవేద్య అర్చకులకు కూడా వర్తింపచేయాలని, ధూప దీప నైవేద్య అర్చకులకు ఆరోగ్య భద్రత కు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, తెలంగాణలోని అన్ని జిల్లాలలో అర్చకులకు అర్చన భవనం ఏర్పాటు చేయాలన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అర్చకులకు రాజకీయ వేధింపుల నుండి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్ర దేవాలయాలలో ధూప దీప నైవేద్య అర్చకుల కుటుంబాలకు ఉచిత శీఘ్ర దర్శన భాగ్యాన్ని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి నంది శివకుమార్,జిల్లా ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.