మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్ పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలలో భాగంగా నర్సంపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పనిచేయుచున్న సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేశారు. మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ను, కోర్టుకు సంబంధించిన రికార్డ్స్ ను తనిఖీ చేశారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణలో పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సిఐ రమణమూర్తి , ఎస్సైలు రవికుమార్, అరుణ్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరైనారు.