Breaking News

మెరుగైన విద్యుత్ కొరకు చర్యలు

పీసీసీ సభ్యులు పెండెం రామానంద్

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

నర్సంపేట పట్టణంలో మెరుగైన విద్యుత్ కు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణంలో మెరుగైన విద్యుత్ కు చర్యలు చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు..
ఈ సందర్భంగా పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం ద్వారకపేట రోడ్డులోని బాలాజీ (కె ఎస్ ఆర్) మహిళా డిగ్రీ కళాశాల పరిధిలో నూతన ట్రాన్స్ ఫారం, దాదాపు 10 కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని బుధవారం ఏఈ, విజయ్ భాస్కర్ తో కలిసి స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, పట్టణంలోని 24వార్డుల్లో ఇప్పకే విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతూ మెరుగైన విద్యుత్ ను ప్రజలకు అందిస్తున్నామని అంతే కాకుండా విద్యుత్ ట్రాన్స్ ఫారలు, విద్యుత్ స్తంభాలు అవసరం ఉన్న చోట నిర్మాణాలు చేపట్టడానికి విద్యుత్ డి ఈ, ఏఈ, ల సహకారంతో ముందుకెళ్తూ నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, విద్యుత్ కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.