Breaking News

పారదర్శకంగా కొనసాగుతున్నఇందిరమ్మ ఇండ్ల సర్వే

మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :

నిరుపేదల సొంతింటి కల అయిన
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే రఘునాథ పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో మమ్ము రంగా పారదర్శకంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ప్రస్తుతం వారి ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించడం జరుగుతుంది. సర్వేకు ఒకరోజు ముందే దరఖాస్తు దారులకు సమాచారం ఇచ్చిన అధికారులు ఆ తర్వాత సర్వే కొనసాగిస్తున్నారు. అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు సర్వే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం