Breaking News

ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించాలి..

  • పోలీస్ కళాబృందం చే అవగాహన కల్పించిన.. సిఐ. క్రాంతి కుమార్.

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పరకాల సీఐ. క్రాంతికుమార్ అన్నారు. సోమవారం రాత్రి నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆదేశాల మేరకు పోలీస్ కళాజాత బృందంచే అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ. క్రాంతి కుమార్ మాట్లాడుతూ..జనవరి నెలను జాతీయ రోడ్డు ప్రమాదాల నివారణ నెల గా ప్రభుత్వం నిర్ణయించిందని, రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కలిపిస్తూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మద్యం తాగి వాహనాలు నడపరాదని,అజాగ్రత్తగా వాహనాలు నడపకూడదని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.పోలీస్ కళాజాత బృందంచే ప్రదర్శనల ద్వారా ప్రజలకు వివరించారు. మరియు స్త్రీలపై అత్యాచారాలు ,సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, గంజాయి, గుడుంబా తాగడం వల్ల వచ్చే నష్టాలను తెలిపారు. డయల్ 100 ప్రాముఖ్యతను తెలుపుతూ..ఏదైనా సమస్య ఉంటే 100 కి డయల్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎస్ఐ‌. శివకృష్ణ , జాగృతి కళా బృందం సభ్యులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

నేటి తరానికి ఆదర్శం అంబేద్కర్.