అభినందించిన పోలీసులు తల్లిదండ్రులు
మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

కుటుంబ సభ్యులు మందలించారని మనస్థాపన చెంది ఓ బాలుడు ఇంటి నుండి పారిపోయి నల్లబెల్లి మండల కేంద్రానికి చేరుకోవడంతో ఆ బాలుడిని వార్త రిపోర్టర్ గంగిశెట్టి నాగభూషణ్ ద్వారా కుటుంబ సభ్యులకు చేరదీసి పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మహబూబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఆల్వాల శ్రీను రమా దంపతులకు ఒక కూతురు కుమారుడు ఉన్నారు. కుమారుడు అలవాల ప్రభు కిరణ్ పదవ తరగతి మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో చదువుతున్నాడు. ఈ నేపద్యంలో ఈ బాలుడు మంచిగా చదువుకొని ప్రయోజకుడివి కావాలని తల్లి తండ్రి సోదరి మందలించడంతో మనస్తాపం చెంది బాలుడు ఇంట్లో నుండి సోమవారం ఉదయం పారిపోయి అక్కడక్కడ తిరుగుతూ నల్లబెల్లి మండల కేంద్రానికి చేరుకున్నాడు. తన వద్దనున్న డబ్బులు అయిపోవడంతో పలువురిని డబ్బుల కోసం యాచించాడు. ఇది గమనించిన నల్లబెల్లి గ్రామస్తులు ఈ బాలుడు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడని నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన గంగిశెట్టి నాగభూషణ్ అనే వ్యక్తికి తెలియజేయడంతో ఆ బాలుని చేరదీసిన నాగభూషణ్ బాలుడి వద్ద ఉన్న ఆధార్ కార్డును ఆధారంగా చేసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న బాలుడు తల్లి ఆల్వాల రమా బాలుడు సోదరి పిన్ని బాబాయిలు. సోమవారం అర్ధరాత్రి సుమారు పదిన్నర గంటలకు నల్లబెల్లి మండల కేంద్రానికి చేరుకోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా స్థానిక ఎస్సై వి గోవర్ధన్ సూచన మేరకు హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య సిబ్బంది ఆధ్వర్యంలో బాలుడి కి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు బాలుడి ని అప్పగించారు. ఇంట్లో నుండి పారిపోయిన బాలుడిని చేరదీసి కుటుంబ సభ్యులు నాగభూషణ్ ను అభినందించారు.
