మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 12 వార్డుల వారీగా గ్రామ సభలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి ఈ నెల 21 వ తేదీ నుండి 24 వ తేది వరకు నాలుగు రోజుల పాటు జరిగే గ్రామ సభలలో మొదటి రోజు 1,5,10 వార్డులకు 22 వ తేదిన 2,6,11 వార్డులకు 23 వ తేదీన 3,7,12 వార్డులకు 24 తేదిన 4,8,9 వార్డులకు గ్రామ సభలు నిర్వహించటం జరుగుతుందని నందికొండ మున్సిపాలిటీ కమీషనర్ దండు శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన వార్డుల గ్రామ సభలు మొదటి రోజు కార్యక్రమం లో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆయా వార్డులకు సంబంధించి ప్రవేశపెట్టే జాబితాలలో అర్హత ఉండి పేరు లేని వారి నుంచి నూతన దరఖాస్తులను స్వీకరించటం జరుగుతుందని వార్డుల వారీగా గ్రామసభ జరిగే చోటనే ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయటం జరుగిందని గత వారం రోజుల క్రితం కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పథకాల అమలు కోసం అర్హులైన లబ్ధిదారుల జాబితాను అధికారులు నాలుగు రోజులుగా వార్డుల వారీగా సర్వే చేసి రూపొందించిన జాబితా ను మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగే మున్సిపల్ వార్డు గ్రామసభల్లో ప్రదర్శించటం జరుగుతుందని, జాబితాల పైన ఏమైనా అభ్యంతరాలు ప్రజల నుంచి వస్తే స్వీకరించి పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపడుతామని అన్నారు. అర్హుత ఉండి పేర్లు జాబితాలో లేకపోతే వెంటనే వారి నుంచి ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరించటం జరుగుతుందని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు హీరేకార్ రమేష్ జి, మంగతా నాయక్, నాగశిరీష మోహన్ నాయక్, ఆదాసు విక్రమ్ నాగరాణి ,వార్డు ఆఫీసర్,ఉమ , సంద్య , అర్చన ,చెన్నమల్లు,వెంకటయ్య పాల్గొన్నారు.
