మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి

జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన మంతెన రవితేజ తెలుగు సాహిత్యం పట్ల చేస్తున్న కృషికి గాను నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు అంతర్జాతీయ సాహిత్య సామాజిక సేవ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జాతీయ తెలుగు యువ పురస్కారన్ని విజయవాడ కేంద్రంగా సంప్రదాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ రెండు తెలుగు రాష్ట్రాల కవులు పాల్గొన్నారు.జాతీయ తెలుగు యువ పురస్కారం లభించినందుకు గాను రవితేజ ఆనందం వ్యక్తం చేశారు.
