Breaking News

ఉమ్మడి ఖమ్మం జిల్లాల అండర్ 17 క్రికెట్ సెలక్షన్స్

మన ప్రగతి న్యూస్ /తల్లాడ

తెలంగాణ ఉమ్మడి ఖమ్మం జిల్లాల క్రికెట్అసోసియేషన్, ఆధ్వర్యంలో,ఈనెల అనగా జనవరి, 25 తారీఖున సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం నందు క్రికెట్ సెలక్షన్స్ జరుగును.సెలక్షన్లో పాల్గొనవలసిన వారు కి కావాల్సినటు వంటి అర్హతలు
అండర్ 17 క్రికెట్ బాలుర విభాగం
సెలక్షన్స్ కి తమ స్కూల్లో చదువు కున్నటువంటి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, మరియు స్కూల్లో స్టడీ సర్టిఫికెట్, తీసుకొని రావాలి.ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించిఉమ్మడి ఖమ్మం జిల్లా టీడీసీ స్టేట్ కోఆర్డినేటర్ మతిన్, మాట్లాడుతూ, గ్రామస్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అలాగే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు సెలక్షన్స్ ఎంతో ఉపయోగపడతాయి, ప్రతిభ ఉన్న క్రీడాకారులును ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది, తధానంతరం,అండర్ 17 తెలంగాణ టి20 నాకౌట్ ఇన్విటేషన్ బౌచర్ ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో టి డి సి ఎ మెంబర్స్ అయినటువంటి ఎండి మతిన్,, బి ప్రసాద్, యు శ్రీనివాస్, తల్లాడ యూనివర్సల్ పిటి సార్ కుంభగిరి నాగేశ్వరరావు, మురళికృష్ణ, తిరుపతిరావు, శ్రీహరి, ప్రవీణ్ కుమార్ ,రామకృష్ణ, పాల్గొనడం జరిగింది ,

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు