Breaking News

గ్రామ సభలో రభస రచ్చ రచ్చ

గ్రామసభలో నిరుత్సాహంగా ప్రజలు

ప్రభుత్వ సర్వే బాగాలేదన్న ప్రజలు

ప్రజలు అధికారులను ప్రశ్నించే క్రమంలో అడ్డుకున్న పోలీసులు

మన ప్రగతి న్యూస్ /వీణవంక

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి   గ్రామసభలో అన్ని అవకతవకలే జరిగాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అధికారులను ప్రశ్నించే క్రమంలో పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది . ప్రజలకు అధికారులను అడిగే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని ,  నిరుత్సాహపడుతున్నారు. ప్రజా ప్రతినిధులను అడుగుదామంటే వారు లేరు. ఇటు అధికారులను అడుగుదామంటే , పోలీసు వారు అడ్డుకుంటున్నారు. మా ఆవేదన, మా బాధ ఎవరికి చెప్పాలి. 

అధికారులైన సరైన  క్రమంలో సర్వే చేస్తే , బాగుండేది. వారు కూడా పేదలెవరు, ఉన్న వారెవరు ,  లేని వారు ఎవరు, అని  సరియైన క్రమంలో సర్వే చేస్తే బాగుండేది . కానీ ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే  , పనికి ఆహార పథకం లో కనీసం 20 రోజులు పని చేసి ఉండాలి, జాబ్ కార్డు ఉండాలని అంటున్నారు. ఇంతకముందు పనికి ఆహార పథకంలో పని చేశాము. ఇప్పుడు మాకు మా ఆరోగ్యం సహకరించకుంటే ఇంటి దగ్గరనే ఉంటున్నాము. చిన్నచిన్న పనులు చేసుకుని జీవనం గడుపుతున్నామని అధికారులను ప్రశ్నించినా కూడా లాభం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు అమ్మ సరోజన నేను పనికి ఆహార పథకానికి ప్రతిసారి వెళ్లిన కూడా నాకు పేరు రాలేదు నేను ఉండేది రేకుల గుడిసెలో నాకెందుకు రాలేదు అని ప్రశ్నించిన అధికారులు నన్ను పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు ఇదేనా సారు మాకిచ్చే బహుమతి కాలుకు పెడితే మెడకు పెడుతున్నారు మెడకు పెడితే కాలుకు పెడుతున్నారు ఇది ఎంతవరకు సరైనది , రండి మా ఇంటికి వచ్చి చూడండి నన్ను నా పరిస్థితిని అన్నా కూడా అధికారులు నన్ను పట్టించుకోవడం లేదు సార్ అని ఆవేదన వ్యక్తం చేశారు. మా బ్రతుకులు ఎప్పటికీ ఇంతేనా లేనివారము లేని వారు లాగానే ఉండాలా ఎందుకు ఈ పథకం పెట్టి మేము మేమే కొట్టుకునే విధంగా చేస్తున్నారు అని ఇటు యువత ముసలి పేద ప్రతి ఒక్కరూ నిరుత్సాహంతో నే సభ ముగియడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అధికారులను ప్రశ్నించే క్రమంలో పోలీసు వారు మమ్ములను అడగకుండా అడ్డుకోవడం ఇది ఎంతవరకు సరైనది . ఇప్పటికైనా పై అధికారులు దీనిపై స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే పథకాలు పేదలకు అందుతున్నాయా అందుతలేవా ఇందులో ఇల్లు ఉన్నవారు ఎవరు,  లేని వారు ఎవరు ,  పని చేసిన వారెవరు,  పని చేయని వారు ఎవరు,  మేడలో ఉన్నది ఎవరు,  గుడిసెలలో ఉన్నది ఎవరు , అని చూడండి అంతేకానీ , ఆరు పథకాలకు అర్హులను గుర్తించకుండా అనర్హులను గుర్తించి గ్రామసభలు పెట్టి గ్రామాలలో గొడవలు సృష్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన కొనసాగుతుందని ఐక్యంగా ఉండే గ్రామాలను పథకాల పేరుతో వారి మధ్య దూరాన్ని పెంచే దిశగా పరిపాలన కొనసాగుతుందని నేడు గ్రామంలో జరిగిన గ్రామసభ పూర్తిగా అనర్హులకే పథకాలను అందే దిశగా అధికారుల యొక్క సర్వే ఉందని కనీసం అప్లికేషన్లకు సమయం ఇచ్చిన ప్రభుత్వం ఎలాంటి నిర్దేశాలను నియమాలను ఇవ్వకుండా మళ్లీ అప్లై చేసుకోవచ్చని చెప్పడం సిగ్గుచేటు పూర్తిగా అవస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడంలో ప్రభుత్వం చొరవ చూపుతోందని గడిచిన సంవత్సరం కాలంలో ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తూనే వస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ , నయాబ్ తాసిల్దార్ నిజాముద్దీన్ , ఏ ఈ ఓ గౌతమి , పంచాయతీ కార్యదర్శి శరత్ రెడ్డి , హరీష్ వర్మ, అప్పని యారా ఐలయ్య గొట్ట రాజయ్య ,అమ్మ అజయ్, గుండె హరీష్ ,అమ్మ సరోజన, రాదా సమ్మేయ ,సుశీల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.