Breaking News

21 వ వార్డులో ప్రజా పాలన వార్డ్ సభను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీకిషన్

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

పట్టణంలోని 21 వ వార్డులో ప్రజా పాలన సభ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజని కిషన్. వార్డు ప్రజల నుండి ప్రభుత్వం ప్రకటించిన కొత్త రేషన్ కార్డు లు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలో ప్రతి వార్డులో ప్రజా పాలన సభలో కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డులలో చేర్పులు మార్పులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులు చేసుకొని వారికి, చేసుకున్న మిస్సయిన వారికి ఇప్పుడు అవకాశం ఉందని ,ప్రతి ఒక్కరు దరఖాస్తును ప్రజాపాలన వార్డు సభలో అందజేయాలని తెలిపారు. ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా లబ్ధిదారులను గుర్తించి త్వరలోనే ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సభలో మున్సిపాలిటీ అధికారులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి