మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ ను అడ్డుకున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,గ్రామ ప్రజలు.అధికారులకు,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం. జాబితాలో లేని నిజమైన లబ్ధిదారుల పేర్లు అధికారులు ఏ ప్రాతిపదికన ఈ జాబితా చేశారో చెప్పాలంటూ అధికారులను నిలదీసిన ప్రజలు.

అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పనిచేస్తున్నారా సమాచార లోపంతో ఇలా చేస్తున్నారా చెప్పాలంటూ వాగ్వాదానికి దిగిన గ్రామ ప్రజలు,బిఆర్ఎస్ నాయకులు.పోలీసులు సర్ది చెప్పటంతో సద్దు మణిగిన వివాదం.
