Breaking News

ఘనంగా భారత రాజ్యాంగం 75 వ వార్షికోత్సవం

మన ప్రగతి న్యూస్/హుజురాబాద్:

సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో ఎస్సీ బస్తీలలో సమావేశం నిర్వహించారు. ఇప్పల నర్సింగాపూర్ గాంధీనగర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ గొప్పతనాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తెలియజేశారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ అనగారిన వర్గాల ఆశదీపం, దళితొద్దారకుడు, బహు ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 26 నవంబర్ 2017 న తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించిందన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడుతూ రాజ్యాంగం వర్తమానం మరియు భవిష్యత్తుకు మార్గదర్శి అని ప్రతి పౌరుడు ఏకైక లక్ష్యం అభివృద్ధి చెందిన భారతదేశము నిర్మించడమే అని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవార్ధం పంచ తీర్దాలను అభివృద్ధి చేసింది.
అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా చారిత్రాత్మక కార్యక్రమాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతుందని అందులో భాగంగా మహిళలకు రాజకీయంగా ఎదగాలని 33 శాతం రిజర్వేషన్ కేటాయించిందని తెలియజేసారు. భారత రాజ్యాంగం 75 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలతో మమేకమై రాజ్యాంగం మరియు డాక్టర్ బాబాఅంబేద్కర్ గురించి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ కోఆర్డినేటర్ బొరగాళ్ల సారయ్య కొలిపాక శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు బొడ్డు మహేష్ బిజెపి సీనియర్ నాయకులు పోతుల సంజీవ్ నరాల రాజశేఖర్ తిప్పబత్తిని రాజు యాళ్ల సంజీవరెడ్డి పడారి కొమురయ్య దండ సమ్మి రెడ్డి తాళ్ల పెళ్లి హరీష్ మొలుగూరి రాజు హృతిక్ పల్లె వీరయ్య దండ సమ్మిరెడ్డి అనిల్ గూడూరి రామ్ రెడ్డి గూడూరు మల్లారెడ్డి బోరగాల అజయ్ మాడుగుల అజయ్ కుమ్మరి సంపత్ కలగోని సంపత్ గంధం అనిల్ పర్థం రాము సాయి గంగరాజు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం