పట్టించుకోని ప్రభుత్వం
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారం రమేష్
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
పంట పొలాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలకుర్తి మండలంలోని చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి ఏళ్ళు గడుస్తున్నా నేటికీ అసంపూర్తిగానే మిగిలాయని పాలకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రిజర్వాయర్ల పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితుల్లో పాలకులు ఉన్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ అన్నారు. బుధవారం సిపిఎం ప్రతినిధుల బృందం పాలకుర్తి మండలంలోని చెన్నూర్ రిజర్వాయర్ ను సందర్శించి నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారు . ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో కొంత నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా వదిలేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే పబ్బం గడుపుతోందని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా అనేక బహిరంగ సభలో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను పూర్తి చేసి పాలకుర్తి ప్రాంతంలోని వ్యవసాయాన్ని సశ్యశ్యామలo చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చెప్పారని
గుర్తు చేశారు. ఎం ఎల్ ఎ. గా గెలిచి సంవత్సర కాలం దాటుతున్నను స్ధానిక ఎమ్మెల్యే పట్టించు కోకపోవడం విచారకరమన్నారు. రిజర్వాయర్ల నిర్మాణం పనులు నత్తనడక నడవడానికి కారణం పాలకుల నిర్లక్ష్యమే అని విమర్శించారు. రైతాంగానికి సాగునీరు ప్రజలకు తాగునీరు కోసం అని రిజర్వాయర్ల నిర్మాణము చేపట్టి నా ప్రభుత్వం కాంట్రాక్టర్లను బదిలీ చేస్తూ రిజర్వాయర్ల నిర్మాణమును ఓట్ల రాజకీయంగా మార్చుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొన సాగిందని తెలిపారు. పనులకు నాసిరకం ఇసుక వాడుతున్నారని రిజర్వాయర్ లోకి నిండుగా నీరు వచ్చిన సందర్భంలో కొట్టుకపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు స్థానిక శాసన సభ్యురాలు యశస్వినిరెడ్డి కృషి చేయాలని అన్నారు. రిజర్వాయర్ లోపల ముళ్ళకంప, రాతి గుండ్ల తో నిండి వుంది. ప్రస్తుతం చెరువులో వర్షానికి వచ్చిన నీరు తప్ప ప్రాజెక్టు నుండి వచ్చింది లేదు. వెంటనే రిజర్వాయర్ నిర్మాణం పనులు చేపట్టక పోయినట్లయితే స్థానిక రైతులందరినీ సమీకరించి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, మండల నాయకులు సోమసత్యం, మాసంపల్లి, నాగయ్య, ఏదునూరి మదార్ తదితరులు పాల్గొన్నారు.