ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు
అర్హులైన లబ్ధిదారులందరికీ దశల వారిగా ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్ కార్డులు
ఇందిరమ్మ ఇండ్లు అర్హుల లిస్టులో పేరు రానివారు గ్రామ సభల్లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు
ఇందిరమ్మ రైతు భరోసా ఉపాధి హామీ (వంద రోజుల ) పని కార్డు ఉండి అర్హత కలిగిన వారంతా అర్హులే
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్
మనప్రగతి న్యూస్/ మంగపేట: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న 4 సంక్షేమ పథకాలు కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రైతు భరోసా
ఈ నాలుగు సంక్షేమ పథకాల కొరకు రాష్ట్రo లో అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభ నిర్వహించి అర్హులు ఎవరు అనే అంశంపై పరిశీలన లిస్టులో ఏ ఒక్క పథకం కు అయినా అర్హులు అయినా కూడ పేరు రాలేదు అని చింతించాల్సిన అవసరం లేదు పేరు రానివారు మరల అప్లికేషన్ చేసుకునే విధంగా అవకాశం ఉంది. ఈ నాలుగు సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది .తరవాత రోజుల్లో అర్హులు అయినా కూడా మళ్లీ అప్లికేషన్ చేసుకోవచ్చు గత ప్రభుత్వంలో కుటుంబ పాలనా చేసిన బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రచారం ఎవరు నమ్మొద్దు. సంక్షేమ పథకానికి అర్హులు ఎవరు ఉన్నా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది కనుక ఎవరు బాధపడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ కోరారు.