Breaking News

పురపాలక సంఘం కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన సాధారణ సమావేశం

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని అధ్యక్షతన ఏర్పాటు చేసిన సాధారణ సమావేశ కార్యక్రమానికి శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, గౌరవ అతిధి గా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి హాజరైనారు. ఇట్టి సమావేశంలో పలు ఎజెండా అంశాలను తీర్మానించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే పట్టణంలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేపడతామని మరియు ఆరు గ్యారెంటీల పథకాలపై గతంలో దరఖాస్తు చేసుకొని వారు వార్డు సభలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. శానిటేషన్కు సంబంధించిన సమస్యలు త్రాగునీరు సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఈ సమావేశంలో ఆర్డిఓ ఉమారాణి, కౌన్సిలర్లు దెవోజు తిరుమల, నునావత్ కవిత, శీలం రాంబాబు, రామ సహాయం శ్రీదేవి ,మినుముల రాజు ,గందె రజిత , రాయుడి కీర్తి , నాగిశెట్టి పద్మ, గడ్డమీది సునీత ,మహమ్మద్ పాషా, రుద్ర మల్లీశ్వరి, ఏలకంటి విజయ్, ఓర్సు అంజలి, వేల్పుగొండ పద్మ, బోడ గోల్య నాయక్, బత్తిని రాజేందర్, పెండెం లక్ష్మి, మూలకాల వినోద, వేముల సాంబయ్య, బాణాల ఇందిరా, దార్ల రమాదేవి, మరియు కోఆప్షన్ సభ్యులు నాయిని సునీత, కొంకేస జ్ఞాన్ సాగర్, మొహమ్మద్ షేక్ మియా, పరికిజ్యోతి, మున్సిపల్ ఉద్యోగులు సంపత్ రాజేష్ రజిని కిరణ్ నాగరాజ్ లు పాల్గొన్నారు.