విద్యార్థులు, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు
డ్రగ్స్ రహిత పాలకుర్తిగా తీర్చిదిద్దాలి
డ్రగ్స్ డీలర్ల భరతం పట్టాలి
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తిలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ భారీ ర్యాలీ
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

విద్యార్థుల భవిష్యత్తుతో పాటు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మరిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రజలకు సూచించారు. బుధవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాజీవ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ధారావత్ రాజేష్ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని అన్నారు.

డ్రగ్స్ వాడకం చెడును ప్రోత్సహిస్తుందని తెలిపారు. డ్రగ్స్ మహమ్మరిని అంతమొందించాలనే కృత నిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉక్కు పాదం మోపేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రస్తుత తరుణంలో మంచిని ప్రోత్సహించకుండా చెడును ప్రోత్సహించే వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. డ్రగ్స్ చెడు మార్గాన్ని ప్రోత్సహిస్తుందని వివరించారు. డ్రగ్స్ మత్తులో వలువైన ప్రాణాలను యువత కోల్పోతుందని, దీంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుందని వివరించారు. డ్రగ్స్, మత్తు పానీయాలు వాడకుంటే కొంతమంది యువకులు తోటి యువకులను అవహేళన చేస్తారని, అవహేళనతో యువత చెడు మార్గాన్ని ఎంచుకుంటుందని తెలిపారు.

మంచిని ప్రోత్సహించేందుకు యువత నడుం బిగించాలని సూచించారు. డ్రగ్స్ వాడకం ప్రాణాలకే ముప్పని, దేశ భవిష్యత్తు అంధకారంలో మగ్గుతుందని తెలిపారు. చిన్నచిన్న దుకాణాల్లో, టీ కొట్టుల్లో గంజాయి సరఫరా అవుతుందనే ఆరోపణలు ఉన్నాయని, గంజాయిని సరఫరా చేసే ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. పోలీసు దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ రహిత పాలకుర్తి గా తీర్చిదిద్ది రాష్ట్రానికి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పాలకుర్తిని నిలపాలని ప్రజలకు సూచించారు.
డ్రగ్స్ డీలర్ల భరతం పట్టాలి

ఝాన్సీ రెడ్డి
డ్రగ్స్ డీలర్ల భరతం పట్టి, నివారణ చర్యలు చేపట్టినప్పుడే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి అన్నారు. డ్రగ్స్ భారతదేశంలో వాడే సాంప్రదాయం లేదని తెలిపారు. మంచి అలవాట్లు ఉన్న భారతదేశంలో డ్రగ్స్ వ్యాపించడంతో యువత మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోయిందని తెలిపారు. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. డ్రగ్స్ నివారణకు ప్రజలందరూ భాగస్వాములైతేనే డ్రగ్స్ మహమ్మారని అంతమొందిస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్ నివారణకు చేపట్టే చర్యల్లో అందరూ మద్దతు తెలపాలని సూచించారు.
యువత సన్మార్గంలో పయనించాలి
నార్కోటిక్ డిఎస్పి సైదులు
డ్రగ్స్ మహమ్మరిని నివారించినప్పుడే యువత సన్మార్గంలో పయనిస్తుందని నార్కోటిక్ డిఎస్పి సైదులు సూచించారు. డ్రగ్స్ వాడకం వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని తెలిపారు. డ్రగ్స్ ను అంతమందించకుంటే దేశమే నాశనం అవుతుందన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం నార్కటిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు. డ్రగ్స్ ను ఎవరు వాడిన 1908 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నల్ల అందాలు శ్రీరామ్, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ సంతోష్ రెడ్డి, టిపిసిసి సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాదాసు హరీష్ గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, నాయకులు వీరమనేని యాకాంతరావు, మొలుగూరి యాకయ్య గౌడ్, ఎస్సైలు దూలం పవన్ కుమార్, ఎం లింగారెడ్డి, చింత రాజు లతో పాటు నాయకులు గోనె మహేందర్ రెడ్డి, జలగం కుమార్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.