అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు కోసం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్హులను ఎంపిక చేసేందుకే ప్రజల సమక్షంలో గ్రామసభలు నిర్వహిస్తు
న్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విరెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలన్ పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు జారీకి ఈనెల 16 నుండి 20 వరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేశారని తుది జాబితాను వెల్లడించి ప్రజల అభిప్రాయాల సేకరణకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రజల మధ్యలో ఎంపిక జరగాలని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పథకాల అమలులో భాగంగా 21 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభల్లో గ్రామస్తులను ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేస్తున్నామని ఏట నియోజకవర్గం 3500 ఇండ్లు నిర్వహించనున్నట్లు రానున్న నాలుగేళ్ల కాలంలో ప్రతి పేదవానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ముందుగా ఉండటానికి గూడు లేని నిరుపేదలకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు జాబితాలో పేర్లు రాని అర్హులైన వారు ఉన్నట్లయితే గ్రామ సభల్లో కానీ మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని అట్టి దరఖాస్తులను విచారణ నిర్వహించి అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలోని ఆడబిడ్డల భద్రత, శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆత్మీయ భరోసా పథకం ద్వారా వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు. ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. రేషన్ కార్డుల ద్వారా వారికి నిత్యావసర వస్తువుల సరఫరా చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, అభివృద్ధి అవసరాలు , రోడ్లు, తాగునీటి పథకాలు, పింఛన్లు, విద్యుత్ వంటి సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు

.ప్రజలతో నేరుగా మాట్లాడటం ద్వారా పాలనలో పారదర్శకత, బాధ్యతా యుతమైన విధానాలను పటిష్ఠం చేయాలని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, వారి అవసరాలపై చర్చించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు ,రైతులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.