Breaking News

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ చేసుకోగలరు

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి వేముల సాంబయ్య గౌడ్

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు నిరంతర ప్రక్రియ

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని 22వ డివిజన్ కౌన్సిలర్ నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ అన్నారు,
నర్సంపేట పట్టణంలోని 22వ డివిజన్లో ఏర్పాటుచేసిన వార్డు సభ కార్యక్రమంలో రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులతో కలిసి కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వస్తాయని లిస్టులో పేరు లేకపోయినప్పటికీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని లబ్ధిదారులు ఎవరు నిరాశ చెందొద్దని అన్నారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఒక ఇల్లు గాని రేషన్ కార్డు గాని ఇవ్వలేదని ప్రజలు దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారి పోయారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోనే ఎన్నికల హామీల మేరకు పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో, డిప్యూటీ తాసిల్దార్ ఏ రాజేశ్వరరావు, మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ జూలూరు కావ్య, వి గణేష్, జె స్రవంతి, కే తరుణ్,నాగరాజు,మైసి దేవేందర్ లు పాల్గొన్నారు.