మన ప్రగతి న్యూస్/హసన్ పర్తి
క్యాట్ లెవెల్ 2 కి నగరంలోని హంటర్ రోడ్ లో గల శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. బుధవారం పాఠశాల ఆవరణంలో విద్యార్థులను అభినందించి ఆయన మాట్లాడుతూ క్యాట్( నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్) ఆధ్వర్యంలో నిర్వహించే ఒలంపియాడ్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ ,జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ప్రోత్సహించే విధానంలో ముందుంటుందని తెలిపారు. జాతీయస్థాయిలో జరిగే ఈ పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఇంకా ముందుకెళితే తమ వంతు కృషి ఉంటుందని తెలిపారు. 111 మంది విద్యార్థులు రెండో స్థానంలో రాణించారని 11 మంది విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున అవార్డు రావడం చాలా సంతోషం అని ఆనందం వ్యక్తం చేశారు. లెవెల్ 2 లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను నగదు బహుమతి పొందిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య , ఏజీఎం రాజేశ్వర్ రెడ్డి, శివ కోటేశ్వరరావు, రంజిత్, ఐపీఎల్ మ్యాచ్ ఇన్చార్జి సన్నీ కుమార్, దీపిక విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు