Breaking News

క్యాట్ ఫలితాలలో నర్సంపేట శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

జాతీయస్థాయిలో నిర్వహించిన క్యాట్ (నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్) లో నర్సంపేట శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ రావు తెలిపారు. తమ పాఠశాల నుండి గత డిసెంబర్ 8వ తారీకు నిర్వహించిన క్యాట్ పరీక్షలో 34 మంది విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు.
ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో క్యాష్ ప్రైస్ పొందిన విద్యార్థిని విద్యార్థులు రిషి, విహాస్ చంద్ర,, సమీక్ష, బుష్రా తెహసిన్ మరియు ప్రవస్తి లకు మెరిట్ సర్టిఫికేట్, మెడల్, క్యాష్ ప్రైస్ అవార్డు ఇవ్వడం జరిగింది.అందుకు సహకరించిన తల్లిదండ్రులని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ మారుతున్న సమాజంలో సాంకేతికత అనుగుణంగా విద్యా విధానాలు, పోటీ పరీక్షలు విద్యార్థిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతగానో దోహద పడతాయని తెలియజేశారు. అందుకుగాను విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని నిరంతరం క్రమశిక్షణతో సాధన చేయాలని అప్పుడే వారి లక్ష్యాన్ని చేరుకుంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం పద్మాకర్, కోఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి, డీన్ రాజ్ కుమార్, సి- బ్యాచ్ ఇంచార్జ్ చిరంజీవి మరియు తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం