ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం
- ఎవరు ఎన్ని వేషాలు వేసిన ప్రతి పేదవాడికి న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవానికి అందించాలని లక్ష్యంతోనే చేపడుతున్న గ్రామ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం అవివేకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలకుర్తి పట్టణ అధ్యక్షుడు కమ్మగాని నాగయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిసిసి మాజీ కార్యదర్శి గంగు కృష్ణమూర్తి, మండల కార్యదర్శి బైరు భార్గవ్ లు పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలను బిఆర్ఎస్ బిజెపి సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ నాయకులు ఆ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరినీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.గత 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో కొనసాగినప్పటికీ ఒక పేదవాడికి రేషన్ కార్డు అందించలేని దుస్థితిలో పాలన సాగించారని అలాంటివారు నేడు గ్రామ సభలను అడ్డుకోవడం యహేమైన చర్యని అన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రజా పాలన ద్వారా రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా పథకాలను ప్రతి ఒక్కరికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సభలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుల కుప్ప రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రజా క్షేమమే లక్ష్యంగా ప్రతి పథకాన్ని అమలు చేయడం కొరకు అతి త్వరలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తుందిని అన్నారు. మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావాలనే కార్యకర్తల చేత సభలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ మారం శ్రీనివాస్, పాలకుర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి పన్నీరు వెంకన్న, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి. సలీం ,పెనుగొండ రమేష్, ఎడవెల్లి సోమల్లయ్య,ఆకుల నాగరాజు, గుడ్ల వెంకన్న, సలేంద్ర శ్రీనివాస్ యాదవ్, మామిండ్ల యాకయ్య, కొంగరి రాములు, ఎడవెల్లి వెంకటేశ్వర్లు, శ్రీధర్, శివరాత్రి ఎల్లేష్ కుమార్, అంగిడి ఎల్లయ్య ,కుమార్ ,సంపత్ తదితరులు ఉన్నారు