మన ప్రగతి న్యూస్ /ఏటూరునాగారం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో మూడవ రోజు ప్రారంభించిన ప్రజాపాలన గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ళ అర్హుల లీస్టును వెల్లడించిన అధికారులు.కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే వ్యవసాయ కూలీకి ఇళ్ళు రాకపోవడంతో అధికారులతో వాదించి మనస్థాపానానికి గురై గ్రామ సభలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.అపస్మారక స్థితిలో పడిపోయిన నాగేశ్వరరావును హుటాహుటిన 108 ద్వార ఏటూరునాగారం సామాజికాసుపత్రికి తరలించారు.అప్పటికే నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం 108 ద్వార ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కాగా నాగేశ్వరరావు భార్య లక్ష్మి ఇళ్ళు రాకపోవడం కారణంగానే నా భర్త పురుగుల మందు తాగాడని బోరున అధికారుల ముందు విలపించింది.