మన ప్రగతి న్యూస్ / వీణవంక

వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో దాదాపు 100 మంది పోలీసులు మోహరించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వచ్చి ప్రజల తరఫున లబ్ధిదారులందరికీ , ప్రభుత్వం అందించే పథకాలు ఎందుకు అందట్లేదు అని అధికారులను నిలదీయడం జరిగింది . ప్రజలు మీరు స్వయంగా వచ్చి సర్వే చేసినప్పటికీ ఎవరికీ ఇల్లు ఉన్నది ఎవరికి ఇల్లు లేదు అని మీకు తెలియకుండానే ఈ లిస్టును తయారు చేశారా ఎందుకు మా పేర్లు రాలేదు. ఇండ్లు ఉన్నవారి పేర్లు వచ్చాయి. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఆఫీసుల్లో చుట్టూ తిరుగి , ఎన్ని దరఖాస్తులు ఇచ్చిన ఫలితం లేదు . ఇప్పుడు ప్రభుత్వం ప్రజా పాలన అనే కార్యక్రమం ప్రారంభించినప్పటికీ దానిలో కూడా దరఖాస్తు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది .

ఎందుకు ఇలా ప్రజలతోని ప్రభుత్వం చెలగాటలాడుతుంది , అని ప్రజలు అధికారులను నిలదీయడం జరిగింది . అనర్హుల పేర్లే లిస్ట్ లో వచ్చాయి , అర్హుల పేర్లు రాలేదని, మళ్లీ దరఖాస్తు ఇవ్వండి అని ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారని అధకారులపై మండిపడ్డారు. ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చే బహుమతి , మీకు ఇష్టమైన వారి పేర్లే ఇందులో వచ్చాయని పనికి ఆహార పథకం లో పని చేసినప్పటికీ మా పేర్లు రాలేదు . మళ్లీ సర్వే చేసి సరియైన లబ్ధిదారులు ఎవరు అని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకి. , వీరు సరైనవారా కాదా అని ఇతరుల మాటలు వినకుండా సరైన క్రమంలో సర్వే చేసి మాకు న్యాయం జరిపించాలని ప్రజలు కోరడం జరిగింది. వీరితోపాటు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నిరుపేద కుటుంబాలకు అందకుండా తప్పుడు దారిలో వెళ్తున్నందువలన ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతున్న మీరు సరైన క్రమంలో సర్వే చేసి ప్రతి పేద కుటుంబానికి మీరిచ్చే పథకాలు అందించేలా చూడాలని అన్నారు. ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కూడా అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ప్రబోభాలకు గురి చేయకుండా సరైన క్రమంలో లబ్ధిదారులకు ఈ పథకాలు చేరాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అని అన్నారు. లేదంటే రానున్న రోజుల్లో మీకు ప్రజలే బుద్ధి చెబుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు , బి ఆర్ ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు , బిజెపి నాయకులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు.