Breaking News

అభివృద్ధి ప్రదాత మంత్రి సీతక్క

ప్రజాపాలనతోనే పేద ప్రజలకు మేలు

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

మనప్రగతి న్యూస్/ మంగపేట: ములుగు జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అని ప్రజాపాలనతోనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జాతీయ మిర్చి రాష్ట్ర పోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. గురువారం మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఆమని అధ్యక్షతన నిర్వహించిన ఇందిరమ్మ గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయలతో ములుగు జిల్లా అభివృద్ధి పథంలో పనిస్తుందని గుర్తు చేశారు. అన్ని కులాలకు అన్ని మతాలకు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అంతేకాకుండా మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ప్రత్యేక కోటాలో ఇల్లు మంజూరు అవుతాయని ఆయన తెలిపారు. గ్రామ సభలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీరాజ్ శాఖ అధికారిణి మమత రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసుపాదం జిపి ప్రత్యేక పాలనాధికారిణి విజయలక్ష్మి వ్యవసాయ విస్తరణ అధికారిణి భావన ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ రాంబాబు అకినేపళ్లి మల్లారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ మొయినుద్దీన్ కాంగ్రెస్ నాయకులు ధూళిపాల బాలకృష్ణ నాసిరెడ్డి నాగిరెడ్డి లక్కీ వెంకన్న కటుకూరు శేషయ్య ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజు పూలమ్మ గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.