Breaking News

జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఉత్తమ డ్రైవర్ అవార్డు అందుకున్న నాగార్జున సాగర్ నివాసి

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నాగార్జున సాగర్ నివాసి అయినటువంటి మునుకూరి కృష్ణారెడ్డి కి ఉత్తమ డ్రైవర్ అవార్డు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందచేయటం జరిగింది. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్గొండ రీజియన్ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సావాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర చేతుల మీదుగా మెమెంటో, ప్రశంసా పత్రాన్ని ఉత్తమ డ్రైవర్ ఆయనకు అందచేయటం జరిగింది. కృష్ణారెడ్డి 1998 వ సంవత్సరంలో ఆర్టీసీ డ్రైవర్ గా మొదటగా నల్గొండ యాదగిరి గుట్ట,దేవరకొండ డిపో నందు, విధులలో చేరి ఇప్పటికి 27 సంవత్సరాలు అయినప్పటికి విధులలో బాధ్యతా గా వ్యవహరిస్తూ ప్రమాద రహిత డ్రైవర్ గా పేరు పొంది సంస్థ యొక్క పురోభివృద్ధి కోసం నిరంతరం బాధ్యతతో ఉంటు విధి నిర్వహణలో ప్రయాణికుల భద్రతే ముఖ్యంగా బావించి అంకిత భావంతో పని చేసినందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర శాలువాతో సత్కరించి మెమెంటో, ప్రశంసా పత్రాన్ని ఆయనకు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రగతి న్యూస్ రిపోర్టర్ తో కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని తను పని చేసే సంస్థకు మరింత ఆక్యూఫెన్సీ ని పెంచే విధంగా కృషి చేస్తానని ఆనంద బాష్పాలు తో తెలియజేశారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం