నాగార్జున సాగర్ ఆర్టీసీ కంట్రోలర్ మహ్మద్ ఇక్బాల్ అలీ
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
పార్వతి జడల రామలింగేశ్వరస్వామి కళ్యాణమహోత్సవం ఫిబ్రవరి 4,5,6 వ తేదీల లో నల్గొండ రోడ్డులోని నార్కట్ పల్లి నందు రంగ రంగా వైభవంగా జరుగుతుందని నాగార్జున సాగర్ కంట్రోలర్ మహ్మద్ ఇక్బాల్ అలీ తెలియజేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం,అగ్ని గుండాల మహోత్సవం ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించటం జరుగుతుందని ఎప్పుడు వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం దూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో సహా వచ్చి దర్శించుకుంటారని ప్రజలు కోరుకున్న విధంగా అన్నిరకాలుగా పుణ్యఫలాలు లభిస్తాయని కోరికలు,కార్యాలు నెరవేరుతాయని ప్రజల యొక్క విశ్వాసం ఎప్పటిలాగనే రాష్ట్ర రవాణా సంస్థ భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులను నాగార్జునసాగర్,నల్గొండ నుంచి చెరువు గట్టు వరకు ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసారని, కార్య నిర్వాహకులు ఎప్పటిలాగానే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరిగిందని కావున భక్తులందరు సద్వినియోగం చేసుకుని కళ్యాణ వివాహ ,అగ్ని గుండాల మహోత్సవం, చెరువు గట్టు జాతరకు వేలాది గా భక్తులు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.